Home / News / sports /

Smriti Mandhana : శభాష్ స్మృతి మంధాన.. పింక్ టెస్ట్ లో సెంచరీ తో అదరగొట్టిన లేడి గంగూలీ..

Smriti Mandhana : శభాష్ స్మృతి మంధాన.. పింక్ టెస్ట్ లో సెంచరీ తో అదరగొట్టిన లేడి గంగూలీ..

Smriti Mandhana (BCCI)

Smriti Mandhana (BCCI)

Smriti Mandhana : భారత మహిళల (Indian Womens Cricket) క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆడుతున్న డే అండ్ నైట్ (Pink Test) టెస్టులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana Latest Telugu News) చెలరేగింది.

భారత మహిళల (Indian Womens Cricket) క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆడుతున్న డే అండ్ నైట్ (Pink Test) టెస్టులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana Latest Telugu News) చెలరేగింది. సూపర్ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపిన కెరీర్ లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. స్మృతి మంధాన ధాటికి.. భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. 170 బంతుల్లో సెంచరీ మార్కును అందుకుంది ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. అంతకు ముందు మొదటి రోజు ఆట వర్షార్పణం అయింది. క్వీన్స్లాండ్ వేదికగా జరుగుతున్న ఏకైక డే అండ్ నైట్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 44.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన మిథాలి (mithali raj) సేనకు ఓపెనర్లు స్మృతి మంధాన (smriti mandhana) , షెఫాలి (shefali verma) వర్మ (64 బంతుల్లో 31) శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన పేస్ బలగమున్న ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి చూడచక్కని షాట్ లతో అలరించారు. కానీ 25 ఓవర్లో మోలినెక్స్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన షెఫాలీ.. మెక్ గ్రాత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన పూనమ్ రౌత్ చక్కటి సహకారాన్ని అందించింది.

ఈ ఇన్నింగ్స్ లో మంధాన అయితే ఫోర్ల సునామి సృష్టించింది. ప్రస్తుతం ఆమె సాధించిన పరుగుల్లో 22 ఫోర్లు, 1 సిక్సర్లు ఉన్నాయ్. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు మంధాన ఎలా చెలరేగిందో. మంధాన దాటికి ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ భారీగా పరుగులు సమర్పించుకుంది. ప్రస్తుతం భారత్ వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పునమ్ రౌత్ (27 పరుగులు), స్మృతి మంధాన (126 పరుగులు) ఉన్నారు. స్మృతి మంధాన ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే భారత్ భారీ స్కోరు నమోదు చేసే ఛాన్స్ ఉంది.

ఇక, ఆఖరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ముఖాముఖీ టెస్టు పోరుకు ఇప్పుడు సిద్ధమయ్యాయి. మిథాలీ రాజ్, వెటరన్‌ సీమర్‌ జులన్‌ గోస్వామి అప్పటి మ్యాచ్‌ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే! ఇక మ్యాచ్‌ విషయానికొస్తే భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు.

ఇటీవల ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో మిథాలీ సేన చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్‌ సిరీస్‌ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలకు ఇంగ్లండ్‌తో టెస్టు అనుభవం పైచేయి సాధించేందుకు దోహదం చేయొచ్చు.

ఇది కూాడా చదవండి : పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్.. ఆ జట్టును వీడిన స్టార్ హిట్టర్..! ఆ జట్టుకు ఇక కష్టమే..

హెడ్ టు హెడ్ రికార్డులు : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా, నాలుగు ‘డ్రా’గా ముగిశాయి. భారత్‌ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని మిథాలీ సేన భావిస్తోంది.

Published by: Sridhar Reddy
First published: October 01, 2021, 11:08 IST

Tags:Cricket, India vs australia, Mithali Raj, Smriti Mandhana