Home / News / politics /

INTERNAL FIGHT IN TELANGANA BJP BETWEEN BANDI SANJAY AND ETELA RAJENDER AMID KARIMNAGAR MLC ELECTIONS SARDAR RAVINDER SINGH TO JOIN BJP MKS KNR

Karimnagar mlc : కమలంలో ముసలం -బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ -బీజేపీలోకి సర్దార్ రవీందర్ సింగ్!

కరీంనగర్ బీజేపీ నేతలు

కరీంనగర్ బీజేపీ నేతలు

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక నేతలు ఇద్దరూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన దరిమిలా బీజేపీలో ముసలం మొదలైందనే చర్చ నడుస్తోంది. అసలు బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయా లేక ఈటల రాజేందరా? అనే స్థాయికీ చర్చ వెళ్లింది. దీనిపై ఇద్దరు నేతల అనుచరులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. పార్టీ మేలు కోసమే.. టీఆర్ఎస్ ను దెబ్బతీసేలా ఈటల

(P.Srinivas,News18,Karimnagar)

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీలోనూ ముసలానికి దారితీశాయి. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో నిలవగా, ఆయనకు మద్దతిస్తామని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటన చేశారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అసలీ ఎన్నికల్లో బీజేపీ తటస్థంగా ఉంటుందని చెప్పారు. కీలక నేతలు ఇద్దరూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన దరిమిలా బీజేపీలో ముసలం మొదలైందనే చర్చ నడుస్తోంది. అసలు బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయా లేక ఈటల రాజేందరా? అనే స్థాయికీ చర్చ వెళ్లింది. దీనిపై ఇద్దరు నేతల అనుచరులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. పార్టీ మేలు కోసమే.. టీఆర్ఎస్ ను దెబ్బతీసేలా ఈటల వ్యూహరచన చేశారని ఆయన వర్గీయులు చెబుతుండగా, మాట మాత్రమైనా అధ్యక్షుడికి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ధిక్కారమే అవుతుందని బండి వర్గీయులు అంటున్నారు. దీంతో..

Karimnagar mlc : బండి సంజయ్‌కి ఈటల పోటు.. bjpకి కొత్త అధ్యక్షుడు.. సర్దార్ రవీందర్ సింగ్ ఖేల్ ఖతమంటూ

భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు రాజుకుంటుంది . కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి రెండు స్థానాలకు గాను టీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులు భానుప్రసాదావు , ఎల్ . రమణలను బరిలో ఉంచింది . బలం లేదు కనుక బరిలో ఉండరాదని బీజేపీ నిర్ణయించుకుంది . మొత్తం పది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు , నిన్నటివరకు టీఆర్ఎస్ లో ఉండి రాజీనామా చేసి నామినేషన్ దాఖలు చేశారు . మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ . రవీందర్ సింగ్ నామినేషన్ ను కరీంనగరు చెందిన ముగ్గురు బీజేపీ కార్పోరేటర్లు ప్రతిపాదించారు కూడా , రవీందర్ సింగ్ తెలంగాణ ఉద్యమసమయంకంటే ముందు బీజేపీలో పనిచేశారు , కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరి కార్పొరేటర్ , మేయర్ గా పనిచేశారు . స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ను ఆశించిన రవీందర్ సింగు చుక్కెదురుకావడంతో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు . కాగా,

పోలీసులే గ్యాంగ్ రేప్ చేశారు -ఇద్దరమ్మాయిలతో మసాజ్ కావాలంటూ -అటు ఇటు మార్చుకుంటూ దారుణంగా..

సర్దార్ రవీందర్ సింగ్ కు బాహటంగా బీజేపీ కి చెంది న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటిస్తుండటం కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మింగుడు పడటం లేదని తెలసింది . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలియకుండా తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ముగ్గురు కార్పొరేటర్లు రవీందర్ సింగ్ ను బలపరిచారని సంజయ్ దగ్గరివారి తో అన్నట్లు తెలిసింది . ఈటల రాజేందర్ సూచన మేరకే రవీందర్ సింగ్ పోటీలో దిగారని ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల తరువాత గెలిచినా , ఓడినా రవీందర్ సింగ్ బీజేపీలో చేరుతారనే మరో ప్రచారం కూడ నడుస్తుంది . ఈటల రాజేందర్ అన్ని తానై నడిపిస్తున్న తీరుపై సంజయ్ వద్ద సీనియర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలసింది . పార్టీ నిర్ణయం లేకుండా ఎలా సింగ్ కు మద్దతు ఇస్తారని , ప్రకటన జారీ చేస్తారని ప్రశ్నిస్తుండటంతో సంజయ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్య వర్గంలో చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలసింది .

diabetes care : డయాబెటిస్‌ చికిత్సకు రాయితీ -సుప్రీంకోర్టు CJI Ramana

ఈనెల 29 (సోమవారం) నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వెలుతున్న సంజయ్ ఇక్కడి అంశాలను జాతీయ అధ్యక్షుని దృష్టికి తీసుకెల్లే అవకాశాలు ఉన్నాయని సంజయ్ వర్గీయులు అంటున్నారు . ఈటల టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు సింగు మద్దతు ప్రకటించారని ఆయన వర్గీయులు అంటున్నారు . ఇన్ని రోజులు ఒకే తాటిపై ఉన్న బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విడిపో యే ప్రమాదం కూడ లేకపోలేదు . ఎన్నికల రోజున విప్ జారీ చేస్తారా లేక అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయాలని చెపుతారా చూడాలి . మొత్తానికి సింగ్ వల్ల బీజేపీలో చిచ్చు రాజుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . నగర మేయర్ ఆదివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ అధ్యక్షుడు సంజయ్ నా లేక ఈటల అనే సందేశాన్ని వ్యక్తం చేశారు , బీజేపీలో అంతర్గతంగా ఎమ్మెల్సీ ఎన్ని కలపై చర్చ జరుగుతుండటంతో ఇతర పార్టీలకు అవకాశం వచ్చినట్లయిందని బీజేపీ సీనియర్లు అంటున్నారు . ఎన్నికల సమయానికి ఈ ఎన్నిక ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.
Published by: Madhu Kota
First published: November 29, 2021, 12:42 IST

Tags:Bandi sanjay, Bjp, Etela rajender, Karimnagar, Mlc elections