Home / News / movies /

Anushka Marriage: అనుష్కకు అప్పుడే పెళ్లి జరుగుతుందట..! ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా..

Anushka Marriage: అనుష్కకు అప్పుడే పెళ్లి జరుగుతుందట..! ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా..

anushka shetty (File)

anushka shetty (File)

Anushka Marriage: జ్యోతిష్యుడు ‘వేణు స్వామి’ యూట్యూబ్‌ వీడియోలు చూసేవారికి ఈ పేరు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకం చెప్పి విపరీతంగా ట్రోలింగ్‌ గురయ్యారు వేణుస్వామి. ఇటీవల అతడి జాతకం నిజం అవుతున్నాయి. సమంత, నాగచైతన్య విడాకుల విషయం అతడు చెప్పిన విధంగానే జరిగింది. తాజాగా అనుష్క శెట్టి పెళ్లిపై అతడు ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు.

జ్యోతిష్యుడు ‘వేణు స్వామి’ యూట్యూబ్‌ వీడియోలు(Youtube Videos) చూసేవారికి ఈ పేరు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకం చెప్పి విపరీతంగా ట్రోలింగ్‌(Troling) గురయ్యారు వేణుస్వామి(Venuswamy). జ్యోతిష్యాన్ని నిజానికి చాలా మందే న‌మ్ముతారు. అయితే వారు చెప్పేది నిజం అయ్యే సంద‌ర్భంలోనే వాళ్ల‌ను న‌మ్ముతారు. జ్యోతిష్యుడు వేణు స్వామి ఎలా లెక్క వేస్తారో తెలియ‌దు కానీ.. అనేక విష‌యాల గురించి ఆయ‌న ముందుగానే చెప్పి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న చెప్పిన అనేక విష‌యాలు నిజం అయ్యాయి. ఆయన చెప్పే దానిలో 90 శాతం నిజమయ్యాయి అని చెప్తుంటారు.

Samantha: సమంత అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..! ఏంటంటే..

ఇటీవల సమంత(Samantha), నాగచైతన్య(Nagachaitanya) అభిమానుల మనసు విరిచేస్తూ విడిపోయారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వీరు త్వరలో విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వార్తలను నిజం చేస్తూ అక్టోబర్ 2 న వారిద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక మీదట తాను సమంత భార్య భర్తలు కామని, అయినప్పటికీ వారి బంధం ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాగ చైతన్య. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమైంది అంటూ సోషల్ మీడియాలో ఓ ఒక వీడియో వైరల్ గా మారింది.

Suma-Rajeev Kanakala: రాజీవ్ కనకాలపై సుమ సంచలన వ్యాఖ్యలు.. నా భర్త అలాంటి వాడే అంటూ..

వేణుస్వామి ఆ వీడియోలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగచైతన్య సమంత త్వరలోనే విడిపోతున్నట్లు గా తెలిపారు. వారిద్దరూ కలిసి ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని, కానీ ఒకవేళ వారు గనక విడిపోతే మాత్రం నాగచైతన్య (Naga Chaitanya) టాలీవుడ్ లోనే స్టార్ రేంజ్ కి వెళ్ళి పోతాడు అని.. సమంత స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు అన్నీ అబద్ధమని.. చాలా మంది కొట్టి పారేశారు.

అంత‌టి బ్యూటిఫుల్ క‌పుల్ ఎందుకు విడిపోతారు.. అంటూ ఆయ‌న‌ను శాపనార్థాలు పెట్టారు. కానీ చివ‌ర‌కు ఆయ‌న చెప్పిందే నిజ‌మైంది. ప్రస్తుతం అతడు విపరీతంగా పాపులారిటీ సంపాదించారు. అతడు ఏం చెప్పినా నిజం అవుతాయనే నమ్మకంలో జనాలు ఉన్నారు. అయితే తాజాగా అతడు మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ హీరోయిన్, నటి అనుష్క శెట్టి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

Samantha-Nagachaitanya: సమంతకు నాగచైతన్య అంటే ఇంత ఇష్టమా.. మరెందుకు ఇలా అయింది..

అనుష్క శెట్టి తన వృత్తిలో డెడికేటెడ్ గా వర్క్ చేస్తుందని.. ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే.. సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని.. సినిమా రంగానికి చెంద‌ని వ్య‌క్తినే ఆమె పెళ్లి చేసుకుంటుంద‌ని చెప్పారు. అనుష్క కచ్చితంగా సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని అంటే.. బయట వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. అలాగే ఆమె 2023 లోపు పెళ్లి చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. దీంతో వేణుస్వామి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Viral Video: కొత్తగా.. సరికొత్తగా.. కొత్త పెళ్లి జంట.. జేసీబీలో ఇలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి ఇలా చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ స‌రైన సమాధానం మాత్రం రావ‌డం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప క్లారిటీ రాలేదు.2021 నవంబర్ 7తో 40 వసంతాలు పూర్తి చేసుకుని.. 41కి చేరవవుతుంది అనుష్క. వేణుస్వామి చెప్పినవి దాదాపు చాలా వరకు నిజం అవుతాన్నాయి.. అయితే అనుష్క విషయంలో కూడా ఇలా జరుగుతుందా.. లేదా అనేది కాలమే నిర్ణయం తీసుకోవాలి.

Published by: Veera Babu
First published: October 14, 2021, 08:03 IST

Tags:Anushka Shetty, Marriage