సమంత(Samantha).. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరే. అక్టోబర్ 2 నుంచి సోషల్ మీడియాలో నిత్యం సమంతకు సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏమాయ చేసావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా మారింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఆమెకు దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలో కూడా అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత అభిమానులు ఎంతో డిజప్పాయింట్ అయ్యారు. టాలీవుడ్లో బెస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? అని.. అభిమానులు చర్చించుకుంటున్నారు.
అయితే దీనికి సంబంధించి కారణాలు మాత్రం తెలియలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. ఒక పక్క సమంత చేసినదే తప్పు అంటూ కొందరు వివిధ రకాల కారణాలు చెబుతుంటే .. ఏదు అక్కినేని ఫ్యామిలీనే తప్పు చేసిందంటూ చెబుతున్నారు. ఇందంతా ఇలా ఉన్నా.. పెళ్లి అయిన తర్వాత సమంతకు అక్కినేని నాగచైతన్య అంటే ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని సమంత మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ వెల్లడించారు. సమంతకు నాగచైతన్య అంటే ఎంతో ఇష్టమని.. ఆయనను విడిచ ఒక్క క్షణం కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చింది.
ప్రతీ క్షణం అతడి గురించే ఆలోచించేదని.. కానీ ఇలా ఏ కారణం వల్ల విడిపోయారో తనకు తెలియడం లేదంటూ చెప్పారు. వాళ్లు పిల్లలు కనేందుకు కూడా ప్లాన్ చేశారని.. సమంత ఎప్పుడూ పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను చదివేదని సద్నాసింగ్ తెలిపింది. అక్కినేని ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచించేదని తెలిపింది. వాళ్లిద్దరు గొడవ పడంగా తాను ఎన్నడూ చూడలేదని.. ఏ నాడు ఆమె తన భర్త వల్ల ఇబ్బంది పడినట్లు చూడలేదని తెలిపింది. ఇంత అన్యోన్యంగా ఉన్న ఆ జంట ఇలా ఎందుకు విడిపోయారనేది అర్థం కాకుండా ఉందని ఆమె వాపోయింది. ఇదిలా ఉండగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై, సమంతపై వస్తున్న రూమార్లపై పెదవి విప్పాడు. తాను సమంతను అక్క అని పిలుస్తాను. చాలా మందికి అది తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.. కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పెలా అవుతుందన్నారు.
నా కెరీర్‌ను నాశనం చేస్తామని కొంతమంది హెచ్చరిస్తున్నారని అతడు వాపోయాడు. ఫ్యాన్స్ పేరుతో కామెంట్లు చేస్తున్న వారిని అదుపులో పెట్టేందుకు నాగచైతన్య కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆమెకు కచ్చితంగా మద్దతుగా ఉంటానన్నారు. ఇలాంటివి ఫ్యాన్స్ ఎన్ని ట్రోలింగ్ లు చేసినా తాను భయపడను అంటూ చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Akkineni samantha, Samantha