‘గ్యాంగ్ లీడర్’గా నాని ఖేల్ ఖతం.. నెక్ట్స్ ఏంటో తెలుసా..

ప్రస్తుతం నాని.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేసాడు. తాజాగా నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాను స్టార్ట్ చేసాడు.

‘గ్యాంగ్ లీడర్’గా నాని ఖేల్ ఖతం.. నెక్ట్స్ ఏంటో తెలుసా..

    ‘ఎంసీఏ’ సినిమా వరకు వరస హిట్లతో దూకుడు చూపించిన నాని..ఆ తర్వాత చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’,‘దేవదాస్’ సినిమాలతోొ అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఇయర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసిన ‘జెర్సీ’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు విమర్శకులు ప్రశంసలు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం నాని.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేసాడు. ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కావాల్సింది. కానీ ప్రభాస్ నటించిన ‘సాహో’ ఆగష్టు 30కు పోస్ట్ పోన్ కావడంతో ఈ  సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా పడింది.

    నాని ‘V’ షూటింగ్ ప్రారంభం

    మరోవైపు నేచురల్ స్టార్ నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌  ప్రారంభమైంది. అంతేకాదు నాని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. హీరోగా నానికి ఇది 25వ సినిమా. ఇందులో సుధీర్ బాబు మరో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్‌ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. అందుకే ఈసినిమాకు ‘V’ టైటిల్ పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాలో అదితిరావు హైదరి,నివేధా థామస్ హీరోయిన్స్ నటిస్తున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:August 11, 2019, 11:31 IST