హోమ్ / వార్తలు / లైఫ్ స్టైల్ /

Remedies for cough: జలుబు, దగ్గు తగ్గాలంటే మీరు రోజూ కూరల్లో వాడే ఈ పదార్థం తీసుకోండి.. అదేంటంటే

Remedies for cough: జలుబు, దగ్గు తగ్గాలంటే మీరు రోజూ కూరల్లో వాడే ఈ పదార్థం తీసుకోండి.. అదేంటంటే

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందితే.. తరువాత మిగతా వాటికి అదుపులో పెట్టొచ్చు. అయితే అల్లంతో జలుబుకి తొందరగా చెక్ పెట్టొచ్చంట. అంతేకాదు అల్లంతో చాలా ఉపయోగాలు(benefits) కూడా ఉన్నాయంట. ఈ అల్లం యాంటి ఆక్సిడెంట్​గా పనిచేస్తుందట.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జలుబు(cold), దగ్గు(cough) అనేవి సహజంగానే వస్తాయి. అయితే ఈ కరోనా సమయంలో ఏ జలుబు దేనికి సంకేతమనేది తెలియడం లేదు. వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ ఈ దగ్గు, జలుబులు తొందరగా తగ్గవు. వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది. వీటితో పాటు పలు అనారోగ్య సమస్యలు(health problems) కూడా మొదలు అవ్వవచ్చు. అందుకే ముందు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందితే.. తరువాత మిగతా వాటికి అదుపులో పెట్టొచ్చు. అయితే అల్లంతో జలుబుకి తొందరగా చెక్ పెట్టొచ్చంట. అంతేకాదు అల్లంతో చాలా ఉపయోగాలు(benefits) కూడా ఉన్నాయంట. ఈ అల్లం యాంటి ఆక్సిడెంట్​గా పనిచేస్తుందట. శరీరంలో రోగ నిరోధక శక్తి (immunity power)ని పెంచుతుందట. వ్యాధులపై పోరాటానికి తగిన శక్తి అందిస్తుందట. ఆ వివరాలు తెలుసుకుందాం..


అల్లం(ginger) మనం కూరలకు(curries) ఎక్కువగా వాడుతుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే(taste) కాదు. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను(Unhealth issues) న‌యం చేయ‌డంలోనూ అల్లం(ginger) బాగా ఉప‌యోగ‌ప‌డుతుందట.  అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు(cough), జ‌లుబు(cold), జ్వ‌రం(fever) త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.రక్త శుద్ధికి అల్లం తోడ్పడుతుంది. ర‌క్త‌ నాళాలలో ర‌క్తం గడ్డకట్టనీయకుండా అల్లం సహాయపడుతుందట.




ఇది కూడా చదవండి: నిమ్మరసం, తేనే తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?


అల్లంలోని గుణాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే జలుబు, వైరస్ (Flu, virus) బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది. గొంతు నొప్పితో (Throat pain) బాధపడే వారికి సైతం అల్లం ఛాయ దివ్య ఔషదంగా పనిచేసి వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లంతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of ginger) ఉన్నాయి కనుకే దీనిని వంటింటి ఔషధంగా చెబుతుంటారు.


అల్లంను కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అందుకు నిత్యం అల్లం ర‌సాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే సేవించాలి. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరే ప్రమాదకర బ్యాక్టీరియాల‌ను సంహరిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.అల్లం ర‌సాన్ని రోజూ సేవిస్తుంటే కొన్ని రోజుల‌కు బ్ల‌డ్ షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.


జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తొలగించ‌డంలో అల్లం మెరుగ్గా ప‌నిచేస్తుంది. నిత్యం అల్లం ర‌సం సేవించ‌డం వ‌ల్ల అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి. ప్రతీ రోజు అల్లం తీసుకోవడం ద్వారా కండరాల నొప్పిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. రోజూ అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పి (Muscle pain) క్రమంగా తగ్గుతుంది.

Tags:Ginger, Health benefits, Health Tips, Life Style

అగ్ర కథనాలు