Cuba: క్యూబాలో క్యాస్ట్రోలో ముగిసిన శకం.. కొత్త నాయకత్వంతో మార్పొస్తుందా..?

క్యూబాలో ఆరు ద‌శాబ్ధాల త‌ర్వాత అధికారికంగా చారిత్ర‌క నాయ‌క‌త్వ మార్పు ‌చోటుచేసుకుంది. క్యాస్ట్రో సంత‌తి కాకుండా మ‌రో వ్యక్తి పాలనలో ముందడుగు వేస్తుందా అనేది చర్చనీయాంశమైంది.

Cuba: క్యూబాలో క్యాస్ట్రోలో ముగిసిన శకం.. కొత్త నాయకత్వంతో మార్పొస్తుందా..?
రౌల్ క్యాస్ట్రో

ప్రపంచ పటంలో క్యూబాది ప్రత్యేక స్థానం. విప్లవానికి పర్యాపదం క్యూబా. అలాంటి క్యూబాలో ఆరు ద‌శాబ్దాల త‌ర్వాత అధికారికంగా చారిత్ర‌క నాయ‌క‌త్వ మార్పు ‌చోటుచేసుకుంది. క్యాస్ట్రో సంత‌తి కాకుండా మ‌రో వ్య‌క్తి అయిన మిగ్యుల్ డియాజ్‌-కానెల్ ఈ క‌మ్యూనిస్ట్ దేశానికి మొద‌టి సివిలియ‌న్ నాయ‌కుడిగా పీఠ‌మెక్కారు. ఈ దేశంలో క‌మ్యూనిస్ట్ పార్టీ మాత్ర‌మే ఉంటుంది. క్యాస్ట్రో తర్వాత ఈ బాధ్యతలను డియాజ్‌-కానెల్ చేపట్టనున్నారు. `ఈ విప్ల‌వంలో అత్యంత ముఖ్యమైన విష‌యం ఏంటంటే పార్టీని ర‌క్షించుకోవ‌డం. అలాగే పార్టీ కూడా విప్ల‌వానికి గొప్ప ర‌క్ష‌గా ఉండాలి` డియాస్ కానెల్ అన్నారు డియాజ్‌-కానెల్‌. అలాగే, నాయ‌క‌త్వం నుంచి విర‌మించుకున్న 89 ఏళ్ల రౌల్ క్యాస్ట్రో (Raul Castro) ను ప్ర‌స్తావిస్తూ, ముఖ్యమైన నిర్ణ‌యాల్లో ఆయ‌నను త‌ప్ప‌క సంప్ర‌దిస్తామ‌ని అన్నారు డియాజ్‌. అంతేకాదు, `రిటైర్ అవుతున్న క్యాస్ట్రో ఎలాంటి పొర‌పాటు జ‌రిగినా, లోపం ఏర్ప‌డినా హెచ్చ‌రిస్తారు, మార్గ‌నిర్థేశం చేస్తారు. సామ్రాజ్య‌వాదాన్ని ఎదుర్కోవ‌డానికి ఆయ‌న మొద‌టిసారి ఎక్కుపెట్టిన తుపాకిలా సిద్ధంగా ఉంటారు` అంటూ క్యాస్ట్రో స్థానాన్ని కొత్త నాయ‌కుడు డియాజ్‌-కానెల్ గుర్తుచేశారు.

2018 నుంచి క్యూబా అధ్య‌క్షుడిగా ఉన్న డియాజ్‌-కానెల్ అంత‌కుమించి అత్య‌ధిక అధికార‌మున్నయసీనియ‌ర్ స్థానం క్యూబా క‌మ్యూనిస్ట్ పార్టీ (పిసిసి) మొద‌టి కార్య‌ద‌ర్శిగా ఇప్పుడు ఎంపిక‌య్యారు. హ‌వానాలో జ‌రిగిన నాలుగు రోజుల పిసిసి కాంగ్రెస్‌లో ముందుగా నిశ్చ‌యించుకున్న ఈ అధికామార్పిడి జ‌రిగింది. 11.2 మిలియ‌న్ల జ‌నాభా ఉన్న ఈ దేశానికి ఇదొక చారిత్రాత్మ‌క ఘ‌ట‌న‌. ఎందుకంటే `కాస్ట్రో` కాని నాయ‌కుడు ఇంత వ‌ర‌కూ ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ తెలియ‌దు. క్యూబా దేశ పితామ‌హునిగా, ఆ దేశ ర‌క్ష‌కుడిగా ఇప్ప‌టికీ ఫిడెల్ క్యాస్ట్రో ( Fidel Castro)ని ఆరాధిస్తారు అక్క‌డి ప్ర‌జ‌లు. 1950 నుంచి 2006 వ‌ర‌కూ ఈయ‌నే ఆ దేశ నాయ‌కుడు. ఆయ‌న అనారోగ్యంతో ఉన్న స‌మ‌యంలో త‌న త‌మ్ముడు అధికారాన్ని చెపట్టారు. 1950లో క్యాస్ట్రో తోబుట్టువులు విప్ల‌వానికి నాయ‌కులుగా ఉన్న త‌ర్వాత డియ‌జ్‌-కానెల్ పుట్టారు. క్యూబాలో కీల‌క‌ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న స‌మ‌యం అది. 1959లో నియంత పుల్జ‌న్సియా బ‌టిస్టాను ప‌డ‌గొట్ట‌డానికి ఈ విప్ల‌వం దారితీసింది. 1962 నుంచి క్యూబాకు వ్య‌తిరేకంగా ఆంక్ష‌లు విధించిన అమెరికాతో ద‌శాబ్ధాల త‌ర‌బ‌డి వివాదం నెల‌కొంది. ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాను సోష‌లిస్ట్ స్టేట్‌గా డిక్లేర్ చేసిన త‌ర్వాత 60 సంవ‌త్స‌రాల‌కు పిసిసి కాంగ్రెస్ స‌మావేశ‌మ‌య్యింది.

ఇప్పుడు ఎన్నో మార్పులు

30 సంవ‌త్స‌రాల కాలంలో క్యూబా అంత్యంత ఘోర‌మైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్ర‌వ్యోల్భ‌ణం ఆకాశానికంటింది. ఆహార కొర‌త అధికంగా వేధిస్తుంది. నిత్య‌వ‌స‌రాల కోసం ప్ర‌జ‌లు బారులుతీరి ఉన్నారు. ప‌రిమిత‌మైన స్వేచ్ఛను వ్య‌తిరేకిస్తూ ప్ర‌జ‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో డియాజ్‌-కానెల్ నాయ‌క‌త్వాన్ని చేప‌ట్టారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కేవ‌లం ఐదు క‌మ్యూనిస్ట్ దేశాల్లో క్యూబా ఒక‌టి. ఆ దేశ అవ‌స‌రాలకు 80% దిగుమ‌తి పైనే ఆధార‌ప‌డిన క్యూబాలో ఎప్పుడూ కొర‌త‌ను ఎదుర్కుంటూనే ఉంటుంది. `నేను పుట్టిన‌ప్ప‌టి నుంచి ఈ దేశంలో క‌మ్యూనిస్ట్ పార్టీ ఒక్క‌టే ఉంది` అంటారు మీగ్యుల్ గ‌యిన్జా. అయితే ఇక్క‌డ ఆక‌లితో ఎవ్వ‌రూ చ‌నిపోయిన దాఖ‌లాలు లేవంటారాయ‌న‌. `అయితే ఈ రోజు మేము ఇరుక్కుపోయాము. మా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌డానికి ఫిడెల్ చ‌నిపోవ‌డం సిగ్గుచేటుగా ఉంది` అంటూ వాపోయారు ఆయ‌న‌. టెక్-శావీ బీటల్స్‌ (Beatles)కు పెద్ద ఫ్యాన్‌ అయిన సూట్‌, టై వేసుకునే డియాజ్-కానెల్ మిల‌ట‌రీ యూనిఫామ్స్‌ని ప్రేమించే కాస్ట్రోల కంటే ఎక్కువ‌ ఆధునికంగానే క‌నిపిస్తారు. అయితే ఈయ‌న పార్టీకి బ‌ల‌మైన సేవ‌కుడు. అందుకే డియాజ్‌-కానెల్ నాయ‌క‌త్వంలో ఎలాంటి సైథాంతిక మార్పులూ చోటు చేసుకోవ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మే 2019లో పాస్ చేసిన‌ కొత్త రాజ్యాంగం `సోష‌లిజం ప‌ట్ల దేశ నిబద్ధ‌త `ఉప‌సంహ‌రించుకోలేనిది` అని క‌చ్చిత‌మైన స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. అయితే ఇటీవ‌లి సంవ‌త్స‌రాల్లో స‌‌ర‌ళీక‌ర‌ణ‌కు (liberalization) చిన్న‌గా ఆమోదాలు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు కేవ‌లం ప్ర‌భుత్వం కంట్రోల్‌లో ఉన్న వంద‌ల కొద్ది సెక్టార్ల‌లో ఇప్పుడు చిన్న‌వ్యాపారాల‌కు ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూరుతున్నాయి.

ఇంటర్నెట్‌తో వ‌చ్చిన మార్పు

క్యూబా ద్వీపంలో 2018లో ఇంట‌ర్నెట్‌తో కూడిన మొబైల్ ఫోన్ ప్ర‌వేశించింది. ఇది సామాజిక మార్పుకు కార‌ణ‌మ‌య్యింది. అంత‌కుముందు ఈ దేశంలో ఎప్పుడూ వినిపించ‌ని విధంగా నిర‌స‌న‌ల‌కు ఇంట‌ర్నెట్‌ని వినియోగించుకున్నారు. ఈ దేశంలో ఉద్యోగ అవ‌కాశాలు లేక విదేశాల‌కు వెళ్లే చాలా మంది క్యూబా యువ‌త సామాజిక మాధ్య‌మాల్లో వారి అసంతృప్తిని తెలియ‌జేస్తున్నారు. దీనికి స్పందించిన పిసిసి ఆన్‌లైన్‌లో రాజ‌కీయ‌, సైద్థాంతిక ప‌రివ‌ర్త‌న‌ను ఎదుర్కోవ‌డానికి కాంగ్రెస్ తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రేస్ జ‌రుగుతుండ‌గానే అక్క‌డ అసంతృప్త స్వ‌రాలు వినిపించాయి. కొంద‌రు వాక్ స్వేచ్ఛ కార్య‌క‌ర్త‌లు త‌మ ఇంటర్నెట్ ఆపేసిన‌ట్లు చెప్పారు. పోలీసులు తాము గుంపులుగా చేర‌తామ‌నే కార‌ణంతో త‌మ‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రానీయ‌లేద‌ని వాపోయారు. ఆదివారం పార్టీ ప్ర‌తినిధులు 114 మందితో ఏర్ప‌డిన‌ కొత్త కేంద్ర క‌మీటీకి ఓట్లు వేశారు. ఇందులో పిసిసి పాలిట్‌బ్యూరోకు 14 మంది ఎంపిక‌వుతారు. క్యూబాలో వీరే అధికారం చేప‌డ‌తారు. డియాజ్‌-కానెల్ నాయ‌కుడిగా ఉన్న ఈ పాలిట్‌బ్యూరో ముగ్గురు మ‌హిళ‌ల‌తో క‌లిసి అంద‌రి స‌గ‌టు వ‌య‌సు 61.6 సంవత్సరాలు. ఈ 14 మందిలో ఐదుగురు కొత్త‌వారు.

2014-2016 మ‌ధ్య అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా హ‌యాంలో తాత్కాలికంగా అయినా స‌రే చారిత్రాత్మ‌కంగా ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించే ఒప్పందాలు చేసుకున్న‌ప్ప‌టికీ, డోనాల్డ్ ట్రంప్ పాల‌న‌లో బ‌ల‌మైన ఆంక్ష‌ల కార‌ణంగా ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. గ‌త శుక్ర‌వారం క్యాస్ట్రో అధికారికంగా ఇచ్చిన చివ‌రి ప్ర‌సంగంలో మాట్లాడుతూ, `అమెరికా సంయుక్త‌రాష్ట్రాల‌తో గౌరవంగా సంప్ర‌దింపులు జ‌రప‌డానికి సుయుఖంగా ఉన్నామ‌ని, అమెరికాతో కొత్త సంబంధాల‌ను నెల‌కొల్పాల‌ని` అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చాలా క‌చ్చితంగా `దేశం సోష‌లిజం, విప్ల‌వ సూత్రాత‌ల‌ను త్య‌జించ‌ద‌ని` బ‌లంగా చెప్పారు. దేశంలోని కొత్త త‌రాన్ని ఉద్దేశిస్తూ, `ఒక పార్టీ సిద్ధాంతాన్ని ఉత్సాహంగా ర‌క్షించుకోవాల‌ని` కోరుకున్నారు. ఈ సంద‌ర్భంలో గ‌త శుక్ర‌వారం వైట్‌హౌస్ అధికార ప్ర‌తినిథి జెన్ స‌కీ మాట్లాడుతూ, `క్యూబా విష‌యంలో అమెరికా ఇప్ప‌టికిప్పుడు పాల‌సీ ప‌రంగా ఎలాంటి మార్పూ చేయ‌ట్లేద‌ని, `ప్ర‌జాస్వామ్యానికి, మాన‌వ హ‌క్కుల‌`పై దృష్టి పెడుతూనే ఉంటామ‌ని` అన్నారు.

Published by:Purna Chandra
First published:April 20, 2021, 19:38 pm