దేశంలో దళిత, గిరిజనుల బిడ్డలపై దాడులు, దారుణాలు, వేధింపులు,చిత్రహింసలు, జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఏదో ఓ మూల వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జార్ఖాండ్(Jharkhand)లో కూడా అదే జరిగింది. స్కూల్లో చదువుతున్న ఓ గిరిజన బాలిక(Tribal student)ని ఓ యువకుడు అత్యంత దారుణంగా కాళ్లతో తంతూ చేతులతో కొట్టాడు. స్కూల్ యూనిఫామ్(School uniform)లో ఉన్న గిరిజన అమ్మాయిని యువకుడు కొడుతుంటే అతని స్నేహితులు వీడియో(Video) తీస్తూ శునకానందం పొందారు. అంతటితో ఆగకుండా ఆ వీడియో(Video)ని ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేసుకున్నారు.
గిరిజన బాలికపై దాడి..
గిరిజన బాలికపై దాడి జరిగిన వీడియోని రజనీ ముర్ము అనే సామాజికవేత్త ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోనే కాదు జార్ఖాండ్ ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లింది. రజనీ ముర్ము
ట్విట్టర్ హ్యాండిల్ నుండి
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పాకూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే అలంగీర్ ఆలమ్‌ను ట్యాగ్ చేశారు. ఓ యువకుడి చేతిలో దాడికి గురైన అమ్మాయి స్కూల్ యూనిఫామ్‌లో ఉంది. పాకూర్‌లోని సెయింట్ స్టానిస్లాస్ హెచ్ఎస్ా్ హతిమారా స్కూల్లో చదువుతోంది. రజిని ముర్ము ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ గిరిజన మహిళలపై నిత్యం ఇలాంటి దాడులు చేయడమే కాకుండా హింసాత్మక వీడియోలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం సమాధానం..సామాజికవేత్త రజిని ముర్ము ట్వీట్‌కి స్పందించారు సీఎం హేమంత్ సొరెన్. తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి సమాధానం ఇవ్వడంతో పాటు దాడి చేసిన యువకుడ్ని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పాకుర్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు ఎస్పీని ఆదేశించారు.
వాడ్ని వదలిపెట్టే ప్రసక్తి లేదు..సీఎం ట్వీట్‌తో పోలీసులు చర్యలకు పూనుకున్నారు. గిరిజన బాలికపై దాడి చేసిన యువకుడు పాకుర్ జిల్లా మహేశ్‌పూర్ బ్లాక్‌లోని రోలమారా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పాకూర్ ఎస్పీ హృదీప్ పి.జనార్దనన్ తెలిపారు.కేసు దర్యాప్తు చేసి నిందితుడ్ని శిక్షిస్తామని తెలిపారు.
Published by: Siva Nanduri
First published: May 22, 2022, 18:33 IST
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Crime news, Jarkhand, Viral Video