
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 16:28 IST
కరోనా విజృంభనతో అంతా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ కస్టమర్లకు డిజిటల్ సర్వీసులను అందించేందుకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో, ఎల్ఐసీ పాలసీదారులు నేరుగా తమ పాలసీ అమౌంట్‌ను పేటీఎం ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది. పాలసీదారులకు విస్తృత శ్రేణి డిజిటల్ చెల్లింపు సేవలను అందించాలనే లక్ష్యంతో పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది. కాగా, ఎల్ఐసీ ఇంతకుముందే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అప్పుడు అన్ని పేమెంట్స్‌ను ఆప్షన్స్‌ను అందించలేదు. కానీ, ప్రస్తుతం కుదుర్చున్న ఒప్పందంతో అన్ని పేమెంట్ ఆప్షన్స్ డిజిటల్ మోడ్‌లకు మార్చింది.
ఇప్పుడు ఎల్ఐసీ ప్రీమియంలను పేటీఎం ద్వారా చెల్లించేందుకు వివిధ బ్యాంకుల యూపీఐ ఛానెల్‌ను లేదా వాలెట్లను ఉపయోగించుకోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, దాదాపు 17 చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు ఎల్‌ఐసితో ఒప్పందం కుదుర్చుకోవడానికి వేలంలో పాల్గొన్నాయి. అయితే, చివరకి పేటీఎం ఈ అవకాశాన్ని దక్కించుకుంది. 2020లో కరోనా మహమ్మారి తరువాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయని ఎల్ఐసీ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో రూ. 60,000 కోట్ల విలువైన ప్రీమియంలను ఒక్క డిజిటల్ మోడ్ ద్వారానే పాలసీదారుల నుంచి వసూలు చేసింది. కాగా, ఎల్ఐసీ ప్రస్తుతం ఎనిమిది కోట్ల పాలసీదారులను కలిగి ఉంది. వారందిరికీ డిజిటల్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో నే పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా ఉదృతి మరింతగా పెరుగుతుండటంతో ఎల్ఐసీ పాలసీదారుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.
కరోనాతో పెరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్..
ఇదిలా ఉంటే, కరోనా విజృంభనతో ఎల్ఐసీ డెత్ క్లెయిమ్‌లు కూడా భారీగా పెరిగిపోయాయి. రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌డీఏకు ఎల్ఐసీ ఇటీవల అందించిన డేటా ప్రకారం, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య డెత్ క్లెయిములు 8 లక్షలను దాటాయి. అంతకు ముందు ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే డెత్ క్లెయిమ్‌లు 21 శాతం మేర పెరిగాయి. ఇంత తక్కువ కాలంలో భారీ ఎత్తున డెత్ క్లెయిమ్‌లు రావడం ఎల్ఐసీ చరిత్రలో ఇదే మొదటిసారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కరోనాతో చాలా మంది మృత్యువాత పడుతుండంతో డెత్ క్లెయిమ్‌ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నయని ఎల్ఐసీ చెబుతోంది. ఇవన్నీ ఫస్ట్‌వేవ్ కేసులేనని, సెకండ్ వేవ్‌లో డెత్ క్లెయిమ్ కేసులు మరింగా పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పెద్ద ఎత్తున్న డెట్ క్లెయిమ్‌లు చెల్లించాల్సి రావడంతో ఎల్ఐసీకి భారీ నష్టాలు వస్తున్నాయి. ఫలితంగా, కరోనా మహమ్మారి ఇన్సూరెన్స్ సెక్టార్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.