
- News18 Telugu
- Last Updated: April 16, 2021, 18:16 IST
గతంలో ఉద్యోగులు పని చేసిన ప్రతీ చోటా కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఓపెన్ చేసేవాళ్లు. కానీ ఆ తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త సంస్థలో కొనసాగించే అవకాశం కల్పించింది. అంటే ఓ ఉద్యోగి జాబ్ మానేసిన తర్వాత పాత యాజమాన్యం దగ్గర ఓపెన్ చేసిన ఈపీఎఫ్ అకౌంట్‌నే కొత్త యాజమాన్యం దగ్గర కొనసాగించొచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పాత ఈపీఎఫ్ అకౌంట్ కంటిన్యూ అవుతుంది. కొత్త యాజమాన్యం జమ చేసే పీఎఫ్ డబ్బులు పాత అకౌంట్‌లోకి వెళ్తుంటాయి. ఈ విషయం తెలియక ఇప్పటికీ చాలామంది పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను అలాగే వదిలేసి కొత్త పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో పాత ఈపీఎఫ్ అకౌంట్ ఏమవుతుంది? అందులో ఉన్న డబ్బుల పరిస్థితి ఏంటీ? డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా? వడ్డీ వస్తుందా లేదా? అన్న సందేహాలు ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఉన్నాయి.
Voter ID Address Change: ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చాలా? ప్రాసెస్ ఇదే
Indian Railways: సరిగ్గా ఇదే రోజు పరుగులు తీసిన మొదటి రైలు... ఏ రూట్‌లో తెలుసా?
ఈపీఎఫ్ఓ అందించే బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో పొందాలంటే ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడమే మంచిదని చెబుతుంటారు ఫైనాన్షియల్ అడ్వైజర్లు. ఒకే అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల కన్‌ఫ్యూజన్ ఉండదు. ఈపీఎఫ్ డబ్బులు మొత్తం ఒకే అకౌంట్‌లో ఉంటాయి. అకౌంట్ సీనియారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉద్యోగం మానేసి కొత్త సంస్థలో చేరగానే పాత ఈపీఎఫ్ అకౌంట్‌నే కొనసాగించాలని కోరాలి. మీ యూఏఎన్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు ఇవ్వాలి. అంతేకాదు... పాత అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని కొత్త ఈపీఎఫ్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. రెండు పీఎఫ్ అకౌంట్లు ఉంటే వాటిని మెర్జ్ చేయాలి. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు ఉంటే ఎలా విలీనం చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
SBI: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన బ్యాంకు
RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి
పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆపరేట్ చేయకుండా వదిలేస్తే ఇనాపరేటీవ్‌గా మారుతుంది. ఆ తర్వాత అందులోని డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి ఐదేళ్ల లోపు డబ్బులు విత్‌డ్రా చేసినట్టైతే అంతవరకు వచ్చిన వడ్డీపై పన్నులు చెల్లించాలి. ఐదేళ్ల తర్వాత విత్‌డ్రా చేస్తే పన్నులు ఉండవు. అందుకే ఎన్ని సంస్థలు మారినా అకౌంట్ కొనసాగించడం వల్ల ఉపయోగమే ఉంటుంది. ఒకవేళ అకౌంట్ ఆపరేట్ చేయకుండా వదిలేసినా వడ్డీ మాత్రం వస్తుంది. అంటే మీరు పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు అలాగే ఉంచినన్ని రోజులు మీకు వడ్డీ వస్తూనే ఉంటుంది. కానీ అకౌంట్ కొనసాగించడం వల్ల అందులో ప్రతీ నెలా డబ్బులు జమ అవుతుంటాయి కాబట్టి అకౌంట్ ఆపరేట్ చేస్తున్నట్టే ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని 58 ఏళ్ల తర్వాత తీసుకోవచ్చు. ఒకవేళ అంతకన్నా ముందే రిటైర్ అయితే 36 నెలల్లో డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలి.