
- News18 Telugu
- Last Updated: April 14, 2021, 18:32 IST
సమ్మర్ హాలిడేస్‌లో టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి మేఘాలయాకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సమ్మర్ హాలిడేస్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులతో సమయం గడపాలనుకునేవారికి, హనీమూన్ వెళ్లాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో షిల్లాంగ్, చిరపుంజి, కాజీరంగా, గువాహతి లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.31,600. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.33,350, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.39,700 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటళ్లలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ టూర్ 2021 మే 1న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
IRCTC Mesmerizing Meghalaya & Assam Tour: ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
May 1: మొదటి రోజు ఉదయం 09:40 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:20 గంటలకు గువాహతి చేరుకుంటారు. అక్కడ్నుంచి షిల్లాంగ్ తీసుకెళ్తారు. వార్డ్స్ లేక్, పోలీస్ బజార్ సందర్శించొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.
IRCTC Goa Tour: రూ.6,620 ఖర్చుతో గోవా టూర్... 7 రోజుల ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
IRCTC Kashmir Tour: కాశ్మీర్‌కు హనీమూన్ వెళ్తారా? ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
May 2: రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిరపుంజికి తీసుకెళ్తారు. అక్కడ నోహ్‌కలికై ఫాల్స్, మావ్‌స్మాయ్ గుహలు చూడొచ్చు. సాయంత్రానికి తిరిగి షిల్లాంగ్ చేరుకోవాలి. దారిలో ఎలిఫాంటా ఫాల్స్ చూడొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.
May 3: మూడో రోజు ఉదయం ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం అయిన మావ్లిన్‌నాంగ్ తీసుకెళ్తారు. లివింగ్ రూట్ బ్రిడ్జ్, దావ్కీ సరస్సు సందర్శించొచ్చు. సాయంత్రానికి షిల్లాంగ్ చేరుకుంటారు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.
May 4: నాలుగో రోజు ఉదయం డాన్ బోస్కో మ్యూజియం, యూమియం సరస్సుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత కాజీరంగా బయల్దేరాలి. రాత్రికి కాజీరంగాలోనే బస చేయాలి.
IRCTC Tour: 11 రోజుల టూర్‌కు కేవలం రూ.10,400 మాత్రమే... ఐఆర్‌సీటీసీ ఉత్తర భారతదేశ యాత్ర వివరాలివే
IRCTC Tour: విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ టూర్... కాశీ, అయోధ్య యాత్రకు వెళ్లండిలా
May 5: ఐదో రోజు ఉదయం ఎలిఫాంట్, సెంట్రల్ రేంజ్‌లో జీప్ సఫారీకి సొంత ఖర్చులతో వెళ్లాలి. ఆ తర్వాత గువాహతి బయల్దేరాలి. బాలాజీ ఆలయాన్ని సందర్శించొచ్చు. రాత్రి గువాహతిలోనే బస చేయాలి.
May 6: ఆరో రోజు ఉదయం కామాఖ్య ఆలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత గువాహతి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తారు. సాయంత్రం 4.10 గంటలకు గువాహతిలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.