Horoscope Today: ఏప్రిల్ 15 రాశి ఫలాలు.. వీరి ఆదాయం పెరగడం ఖాయం

Horoscope Today: ఫిబ్రవరి 15 రాశి ఫలాలు. నేడు ఏ రాశుల వారికి ఎలా ఉంది? ఎవరికీ బాగా లేదు? ఎవరికి బాగుంది? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది? ఈ వివరాలను నేటి రాశి ఫలాల్లో చూడండి.

Horoscope Today: ఏప్రిల్ 15 రాశి ఫలాలు.. వీరి ఆదాయం పెరగడం ఖాయం

    Horoscope: కొత్త సంవత్సరంలో చాలా మందికి మంచే జరుగుతుందని పంచాంగం చెబుతోంది. రాశి ఫలాలు కలిసి వస్తాయని జ్యోతిష పండితులు అంచనా వేస్తున్నారు. మరి నేడు ఏప్రిల్ 15న 12 రాశుల వారికి ఎలా ఉందో ఇక్కడ చూడండి.

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్‌ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. చాలావరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. వివాహ సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    అష్టమ శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చు తగ్గించుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. స్నేహితురాలి నుంచి శుభవార్త వింటారు.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభకార్యం తలపెడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం సంతోషంగా ముందుకు సాగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. విహార యాత్రకు ప్లాన్‌ వేస్తారు. విద్యార్థులు ప్రశంసలు

    అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. తగాదాకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతాయి.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారం నత్తనడకన నడుస్తాయి.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

    పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు వద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా గడుపుతారు.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

    ఈ రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువును కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభ కార్యం తలపెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. హామీగా ఉండవద్దు.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

    ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళతారు. సహచయి, సన్నిహితులతో వాదనకు దిగవద్దు. ప్రేమ వ్యవహారం ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. దూర ప్రయాణాలకు ప్రయత్నాలుచేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పొదుపు చర్యలు చేపడతారు.

    Published by:Shiva Kumar Addula
    First published:April 15, 2021, 07:50 IST