Horoscope today 17-4-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఖర్చుల టెన్షన్లు

Horoscope today 17-4-2021: ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వివాహ సంబంధాలు ఏ రాశుల వారికి కుదిరే అవకాశాలు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Horoscope today 17-4-2021: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఖర్చుల టెన్షన్లు

    \1\6Horoscope today on 17-4-2021: దేశంలో ఆర్థిక పరిస్థితులు బాలేవు. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి... ఏ రాశుల వారికి ఆర్థిక అప్రమత్తత అవసరం, ఏ రాశుల వారికి కలిసొస్తుంది.... వంటి విషయాల్ని జ్యోతిష పండితులు... తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నీ పరిశీలించి ప్రతి రోజూ ఇస్తున్నారు. మరి 17-4-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం. తద్వారా ఏవైనా అనుకోని ప్రమాదకర సంఘటనలు జరిగేలా ఉంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

    మేష రాశి (Aries)

    ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. కొన్ని క్లిష్టమైన కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా మేలు జరుగుతుంది.

    వృషభ రాశి (Taurus)

    ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. గ్రహబలం తక్కువగా ఉంది. ఉద్యోగంలో నిలకడ ఉంది. కొన్ని కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం పరవా లేదు. మితిమీరిన ఖర్చులకు కళ్లెం వేయాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    మిథున రాశి (Gemini)

    ఉద్యోగాలు, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుస్తారు. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. నచ్చినవారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటక రాశి (Cancer)

    మంచి కాలం నడుస్తోంది. గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్‌కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెళతారు. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం.

    సింహ రాశి (Leo)

    ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి.

    కన్య రాశి (Virgo)

    ఉద్యోగంలో చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో గ్రహబలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లోతుగా ఆలోచించి, కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు.

    తుల రాశి (Libra)

    ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది.

    వృశ్చిక రాశి (Scorpio)

    ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబపరంగా చికాకులు ఉంటాయి. మంచి ఆలోచనను ఆచరణలో పెట్టండి. ఉద్యోగ సంబంధమైన ఒక కీలక సమస్యను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. విశ్రాంతి అవసరం.

    ధనస్సు రాశి (Sagittarius)

    ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట యోగం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్య పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచివి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది.

    మకర రాశి (Capricorn)

    ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనులను శ్రమ మీద పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు, సన్నిహితుల సహాయం కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఆశయ సాధనకు బాగా కృషి చేస్తారు.

    కుంభ రాశి (Aquarius)

    ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో పనిచేసి, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంది. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది.

    ఇది కూడా చదవండి:House vastu: ఇంట్లో ఆ కుర్చీలు ఉంటే.. సర్వనాశనమే.. మిగిలేది అప్పులు, అనారోగ్యాలే...

    మీన రాశి (Pisces)

    వ్యాపారపరంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రోత్సాహాలు ఉంటాయి. అయితే, ఒత్తిడి, శ్రమ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల్లో కొందరు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి.

    Published by:Krishna Kumar N
    First published:April 17, 2021, 07:24 IST