Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today: ఏప్రిల్ 16 (శుక్రవారం) రాశి ఫలాలు. 12 రాశుల వారిలో ఎవరికి బాగుంది? ఎవరికి బాగాలేదో? ఇక్కడ చూడండి.

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

    మేషం (అశ్విని, భరణి, క‌‌ృత్తిక 1)

    ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పరవాలేదు. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి బంధువు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. స్నేహితురాలితో విహార యాత్ర చేస్తారు. విద్యార్థులకు బాగుంది.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి కోసం మితిమీరిన ఖర్చు చేస్తారు.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాకు వెళతారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు. కానీ, పెళ్లి ప్రయత్నాలు ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్ వారికి బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు బిజీ అయిపోతుంది.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కామర్స్‌ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. కావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

    ప్రస్తుతానికి ఉద్యోగం మారే ప్రయత్నం చేయవద్దు. పెళ్లి ప్రయత్నాలు అంతగా అనుకూలంగా లేవు. అనవసర ప్రయాణా మీద బాగా

    ఖర్చవుతుంది. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులకు పరవా లేదు.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

    ఉద్యోగం మారాలన్న ప్రయత్నం ఫలిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా లేదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రు సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలికి విందు ఇస్తారు. హామీగా ఉండవద్దు.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

    ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించే ఆలోచనను వాయిదా వేసుకోండి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో సరదాగా షికార్లు చేస్తారు.

    Published by:Shiva Kumar Addula
    First published:April 16, 2021, 08:57 IST