
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 07:40 IST
\1\6Horoscope today on 20-4-2021: ప్రతి రోజు ఎవరి రాశి ఫలాలు వారు తెలుసుకోవాలని అనుకుంటారు. దాని వల్ల అంతా మంచే జరుగుతుంది. రాశి ఫలాలు బ్రహ్మాండంగా ఉంటే... ఆ రోజంతా హాయగా ఉండొచ్చు. అలాకాకుండా ఏవైనా అనారోగ్య, ఆర్థిక హెచ్చరికలు ఉంటే... జాగ్రత్త పడవచ్చు. వాదనలు పెట్టుకుంటే ప్రమాదం అని తెలిస్తే ఆ రోజంతా ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా మెలగవచ్చు. ఇలా రాశిఫలాలు మంచే చేస్తాయి. అందరికీ మేలు చేసే మంచి విషయాలు చెబుతాయి. జ్యోతిష పండితులు గ్రహాలు, సూర్యుడు, తిథి, నక్షత్రం, పంచాంగం, ఘడియలు అన్నీ లెక్కించి... ఈ రాశిఫలాలు ఇస్తున్నారు. మరి 20-4-2021 నాడు ఏయే సూచనలు చేస్తున్నారో చూద్దాం.
మేష రాశి (Aries)
ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో సరదాగా షికార్లు చేస్తారు.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
మిథున రాశి (Gemini)
ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా లేదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలికి విందు ఇస్తారు. హామీలు ఉండవద్దు.
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగం మారాలనే ప్రయత్నం ఫలిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త.
సింహ రాశి (Leo)
ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నం ఫలించదు. పెళ్లి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. అనవసర ప్రయాణాల మీద బాగా ఖర్చవుతుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులకు పరవాలేదు.
కన్య రాశి (Virgo)
ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రులో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు.
తుల రాశి (Libra)
అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కామర్స్
విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఆదాయానికీ, ఉద్యోగానికీ సమస్య లేదు. పెళ్లి ప్రయత్నాలు ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు మీతో బిజీ అయిపోతుంది.
ధనస్సు రాశి (Sagittarius)
ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.
మకర రాశి (Capricorn)
ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు.
కుంభ రాశి (Aquarius)
ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. స్నేహితురాలితో విహార యాత్ర చేస్తారు. విద్యార్థులకు బాగుంది.
ఇది కూడా చదవండి: Telangana Teachers: తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు నేడు డబ్బు పంపిణీ... ఇలా పొందండి
మీన రాశి (Pisces)
సమయం బాగుంది. ఆదాయం పరవాలేదు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. వృత్తిలో రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.