ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
>
హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్ /

విశాఖలో విషాదం.. జగదాంబ సెంటర్‌లో లాడ్జీలో యువకుడి ఆత్మహత్య.. !

విశాఖలో విషాదం.. జగదాంబ సెంటర్‌లో లాడ్జీలో యువకుడి ఆత్మహత్య.. !

విలాసాలకు బాగా అలవాటు పడి మద్యానికి బానిస అయిన అతడు గత కొద్ది కాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. మాజీ ఆర్మీ ఉద్యోగి అయినా తన తండ్రి ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషనశాఖలో సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు.

స్టూడెంట్ సూసైడ్

స్టూడెంట్ సూసైడ్

విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్ సమీపంలో రాఘవేంద్ర లాడ్జిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అతడు ఉంటున్న హోటల్ గది రూములో నుంచి దుర్వాసన వస్తుండడంతో, ఎంత కొట్టినా గది తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటపడింది.

ఈ సంఘటనపై టూ టౌన్ సీఐ తిరుమల రావు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాక ములగడ హౌసింగ్ బోర్డ్ కాలనీ చెందిన బిరుసు రాజేష్ కుమార్ ( 28) బీటెక్ చదువుకున్నాడు. హైదరాబాద్ అమెజాన్ లో కొద్దికాలం పనిచేసి ఆ తర్వాత మానేశాడు. విలాసాలకు బాగా అలవాటు పడి మద్యానికి బానిస అయిన అతడు గత కొద్ది కాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. మాజీ ఆర్మీ ఉద్యోగి అయినా తన తండ్రి ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషనశాఖలో సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు.

తండ్రిని ఖర్చులు కోసం ఇటీవల రాజేష్ కుమార్ డబ్బులు అడిగాడు. తండ్రి లేదనడంతో ఇంట్లో వాళ్లకు ఫోన్ కూడా చేయడం మానేశాడు. కాగా ఈ నెల 15వ తేదీన నగరంలోని జగదాంబ సెంటర్లో గల రాఘవేంద్ర లాడ్జిలో దిగి నాలుగు రోజులు బస చేశాడు. గడిచిన రెండు రోజులుగా ఈ రూమ్ తలుపులు తెరుచుకోకపోవడం, తీవ్ర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించగా వాళ్లు తలుపు గది తెరిచి రాజేష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు. కేసు నమోదు చేసి టూ టౌన్ సీఐ తిరుమలరావు నేతృత్వంలో సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.


Tags:Local News, Suicide, Visakhapatnam, Vizag

అగ్ర కథనాలు