P Ramesh, News18, Kakinada
భారతదేశం (India) హిందూ సాంప్రదాయాలకు (Hindu Traditions) పుట్టినిల్లు. దేవుళ్లతోపాటు ముక్కోటి దేవతల ఆశీసులు ఉండాలంటారు. చరిత్రలోకి వెళితే ప్రజల్ని రాక్షస పాలన నుండి రక్షించేందుకు దేవుళ్లకు సమాచారమిచ్చి గ్రామాలను రక్షించే దేవతలే నేడు మనకు గ్రామ దేవతలుగా నిలిచారు. ప్రతీయేటా ఉత్సవం చేస్తూ అమ్మవార్లని కొలుస్తుంటాం. ముఖ్యంగా కొత్త అమవాస్య అంటే ఆడపడచుకి పెద్ద పండగ. అందుకే ఇంటి ఆడపడచుకి ఎంత గౌరవం ఇచ్చుకుంటామో గ్రామ దేవతకు అంతకంటే ఎక్కువ గౌరవం ఇచ్చి పండగ చేస్తాం. కొత్త అమవాస్యకు అంతటి పేరుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavri District) లో ఉన్న గ్రామాలలో జరిగే దేవతల పండగలకు ఒక్కొక్క పండగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందుకే దేవతలకు నైవేద్యాలు పెట్టి మరీ పూజిస్తారు. ఆయా గ్రామంలో వచ్చే సాంప్రదాయం ఆధారంగా సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగిపోతుంటారు గ్రామాల ప్రజలు.
ముఖ్యంగా కాకినాడ జిల్లా (Kakinada District) లోని పెద్దాపురం మండలం కాండ్రకోట అమ్మవారి ఉత్సవం విశిష్టత తెలుసకుంటే నిజంగా అమ్మ వరం పొందినంత ఆనందం కలుగుతుంది. కాండ్రకోట దేవాలయంలో భారీ విగ్రహ రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. దేవాదాయశాఖ పరిధిలోనికి వచ్చే ఈ ఆలయంలో ఏడాదిలో పెద్ద ఉత్సవం కొత్త అమవాస్య రోజునే జరుగుతుంది. అందుకే కాండ్రకోట జాతర అంటే నూకాలమ్మ జాతరకు పెట్టింది పేరుగా చెబుతారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మదర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలను అమ్మ పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందుతారు.
TDP Mahanadu: నేడు టీడీపీ మహానాడు.. మెనిఫెస్టో ప్రకటన..? కీలక తీర్మానాలు.. వైసీపీ నుంచి చే
గిరిజన గడపకు గోవిందుడు.. ఈ సాంప్రదాయం ఎక్కడంటే..!
Summer Spot: వేసవిలో విహారానికి వెళ్లాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ప్లేస్.. ఇలా ప్లాన్ చేసు
రేపు టీడీపీ మహానాడు.. మేనిఫెస్టో విడుదల? అందులో ఏముందంటే? అభ్యర్థులను ప్రకటిస్తారా?
Transfers Go: బదిలీల జీవో వచ్చిందో లేదో.. వీళ్ల హడావిడి మామూలుగా లేదు..
ఆ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం ఎన్ని కోట్లు తెలుసా..!
ఒంటరిగా ఉంటే ముఖానికి గుడ్డ కట్టి అది లేపేస్తాడు..!
బిచ్చగాళ్లకు స్టార్ హోటల్ లో భోజనం పెట్టిన బిచ్చగాడు!
మహానాడు విందు వంటకాలు అదుర్స్.. స్పెషల్ వీడియో
TDP Mahanadu: టీడీపీ మహానాడులో యమ్మీ యమ్మీ..? గోదావరి రుచుల మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే
దూసుకొస్తున్న సముద్రం.. ముప్పు పొంచి ఉందా..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Andhra Pradesh, East Godavari Dist, Local News