హోమ్ |   ABOUT US

మా గురించి (About Us)

దేశంలో అతిపెద్ద న్యూస్ గ్రూప్ సంస్థ-నెట్‌వర్క్18 ఆధ్వర్యంలో news18.com న్యూస్ వెబ్‌సైట్ నిర్వహించబడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన news18.com వెబ్‌సైట్‌లో telugu.news18.com అంతర్భాగంగా ఉంది. ఎవరి స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాయకుండా, నిష్పాక్షికమైన వార్తా కథనాలను ప్రజలకు అందించడమే మా లక్ష్యం. వండివార్చిన వార్తా కథనాలు కాకుండా...నిజాన్ని నిర్భయంగా చెబుతూ, వార్తలను అత్యంత వేగంగా వీక్షక దేవుళ్లకు అందిస్తూ అక్షరయజ్ఞం చేస్తోంది మా డైనమిక్ టీమ్.

జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై సమగ్ర విశ్లేషణలతో ముందడుగు వేస్తున్నాం. అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, నేటి యువతరం నాడిని పట్టిన యువ జర్నలిస్ట్‌ల మేలు కలయికతో మా టీమ్ వార్తల వడ్డనకు అన్ని వేళలా సన్నద్ధమై ఉంది.

దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో వార్తను సేకరించి, న్యూస్ రూమ్‌కి చేరవేసే వేలాది మందితో కూడిన అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ మా బలం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా న్యూస్18 టీమ్‌, నెట్‌వర్క్18కి చెందిన వేలాది జర్నలిస్టులు వార్తల సేకరణలో 24 గంటలూ పనిచేస్తున్నారు.  సీఎన్ఎన్ సాయంతో అంతర్జాతీయ న్యూస్ అప్‌డేట్స్‌తో పాటు మా నెట్ వర్క్18  దేశంలోని నలుమూలల నుంచి అందించే వార్తా కథనాలను న్యూస్18 తెలుగు ద్వారా వీక్షకులకు చేరవేస్తున్నాం. నిరంతర వార్తా ప్రసారాల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో న్యూఢిల్లీలో నెట్‌వర్క్18 హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటుచేయడమైనది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో ఆన్‌లైన్ వార్తా కథనాలను అందిస్తున్నాం.

హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న మా టీం, తెలుగు డిజిటల్ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని సగర్వంగా చెబుతున్నాం.  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం నెట్‌వర్క్18కి సొంతం. దీంతో పాటు  అందుబాటులో ఉన్న ఇతర మౌలిక వసతులు, వనరులను వినియోగించుకుంటూ వార్తల సేకరణ, ప్రచురణలో దూసుకుపోతున్నాం. దేశ వ్యాప్తంగా 20 ప్రధాన నగరాల్లోని బ్యూరో కార్యాలయాల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, సాంకేతిక నిపుణుల సాయంతో  అక్షరయజ్ఞంలో అందరి కంటే ఒక అడుగు ముందే ఉన్నాం.

వార్తల సేకరణలో వీక్షకులకు కూడా భాగస్వామ్యం కల్పిస్తుంది న్యూస్18 తెలుగు. తమ ప్రాంతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి వీక్షకులు తమ మొబైల్ ఫోన్ నుంచి పంపే వార్తలు, ఫోటోలు, వీడియోలను ఒకసారి ధృవీకరించుకుని మా వెబ్‌సైట్‌లో ప్రచురించడం జరుగుతుంది. తద్వారా వీక్షకులు మా వెబ్‌ ఛానల్‌తో పాటు మా టీమ్‌లోని జర్నలిస్టులతోనూ పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది న్యూస్18 తెలుగు.

గత పదేళ్లలో ఎన్నో ఎక్స్‌క్లూజివ్ స్టోరీలు, బ్రేకింగ్ న్యూస్‌లను వీక్షకులకు అందించడంతో పాటు వేలాది కీలకమైన ఈవెంట్స్‌ను న్యూస్18 కవరేజీ చేసింది.  26/11 ముంబై దాడులు, అమెరికా అధ్యక్షులు జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామాల భారత పర్యటన, దేశ, విదేశాల్లో జరిగిన పలు ఉగ్రవాద దాడులు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, 2008నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి మినిట్ టు మినిట్  అప్‌డేట్స్, ప్రత్యేక విశ్లేషణలు, ప్రత్యక్ష ప్రసారాలు అందించాం. అలాగే ప్రపంచ నలుమూలల నుంచి అతిపెద్ద సినిమా కార్యక్రమాలు, క్రీడా సంబంధిత వార్తా కథనాలు, సిటిజన్ జర్నలిస్ట్ స్టోరీలను అందించి వీక్షకుల మెప్పు పొందుతున్నాం.

Live Now

    Top Stories